Bangalore: ఆరు వారాలుగా విమానంలో వారం వారం వెంకన్న సన్నిధికి.. వీడియో.

|

Aug 01, 2023 | 7:47 AM

బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ప్రతి వారం విమానంలో వచ్చి ఏపీలోని వాడపల్లి వెంకన్నస్వామిని దర్శించుకుంటుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వరస్వామిని ఏడు వారాలు క్రమం తప్పకుండా దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ప్రతి వారం విమానంలో వచ్చి ఏపీలోని వాడపల్లి వెంకన్నస్వామిని దర్శించుకుంటుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వరస్వామిని ఏడు వారాలు క్రమం తప్పకుండా దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు తన సొంత విమానంలో వారంవారం వాడపల్లి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యాయి. సొంత విమానంలో రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి కారులో వాడపల్లి వస్తున్నారు. అంతేకాదు, ఆలయ అభివృద్ధికి ఆ భక్తుడు కోటి రూపాయల విరాళం ఇచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...