Viral Video: గెలుపు మనుషులే కాదు జంతువులు కూడా సంతోషానిస్తుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి..

Viral Video: గెలుపు.. వినడానికి ఇది చిన్న పదమే అయినా.. మనిషికి ఎక్కడలేని బూస్ట్‌ను ఇస్తుంది. ఒక్క విజయం వేయి ఏనుగుల బలాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అందుకే విజయాన్ని...

Viral Video: గెలుపు మనుషులే కాదు జంతువులు కూడా సంతోషానిస్తుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి..
Viral Video

Edited By:

Updated on: Dec 19, 2021 | 7:11 PM

Viral Video: గెలుపు.. వినడానికి ఇది చిన్న పదమే అయినా.. మనిషికి ఎక్కడలేని బూస్ట్‌ను ఇస్తుంది. ఒక్క విజయం వేయి ఏనుగుల బలాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అందుకే విజయాన్ని మనం ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటాం. ఇక క్రీడాకారుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీడల్లో విజయం సాధిస్తే ఎక్కడ లేని సంతోషంతో గంతులేస్తారు. మైదానంలో రచ్చ రచ్చ చేస్తారు. ఇది సహజమనే.. అయితే మనుషులకే ఈ సంతోషం పరిమితమా అంటే.. కాదని చెబుతోందీ ఓ జింక. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఖాళీ ఫుట్‌బాల్‌ మైదానంలోకి ఓ జింక ప్రవేశించింది. వెళ్లిన జింక వెళ్లినట్లు ఉండకుండా.. అక్కడ పడి ఉన్న ఫుట్‌బాల్‌తో ఆడడం ప్రారంభించింది. అచ్చంగా ఓ ప్లేయర్‌ మాదిరి తలతో బంతిని డ్రిల్‌ చేస్తూ వెళ్లి గోల్‌ చేసేసింది. అంతటితో ఆగని ఆ జింక అచ్చంగా మనుషుల్లాగే ఏదో సాధించానన్న సంతోషంతో గెంతులేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జింక ప్రవర్తనను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘సంతోషం మనుషులకే పరిమితం’ కాదంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ ఇంట్రెస్టింగ్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Ashes 2021: పింక్ బాల్‌తో మ్యాజిక్ చేసిన ఆసీస్ స్టార్ బౌలర్.. మరే ఇతర బౌలర్‌కూ సాధ్యం కాలే.. ఆ రికార్డులేంటంటే?

Shocking Video: శునకమా మజాకా.. మీరు కూడా ఇంత ఫర్‌ఫెక్ట్‌గా సిగ్నల్స్ ఇవ్వరంతే..!

AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు