Crow helps Scared: రోడ్డు దాటు రా అయ్యా… కాకిని ఓ రేంజ్‌లో సతాయించిన ముళ్లపంది..!(వీడియో)

Updated on: Sep 14, 2022 | 8:18 AM

ఎవరైనా నిస్సహాయకులు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. చాలా మందికి వారికి సహాయం చేస్తుంటారు. వారిని క్షేమంగా రోడ్డు దాటించిన తరువాత తమ దారిన తాము వెళ్లిపోతారు. అయితే,


ఎవరైనా నిస్సహాయకులు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. చాలా మందికి వారికి సహాయం చేస్తుంటారు. వారిని క్షేమంగా రోడ్డు దాటించిన తరువాత తమ దారిన తాము వెళ్లిపోతారు. అయితే, జంతువులు కూడా కొన్ని కొన్నిసార్లు రోడ్ల మీదకు వస్తుంటాయి. కానీ, వాహనాల రద్దీ కారణంగా అవి రోడ్డు దాటేందుకు తీవ్ర అవస్థలు పడుతుంటాయి. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి అవి ప్రాణాలు కూడా కోల్పోతుంటాయి. అయితే, మనిషికి మరో మనిషి సాయం చేసినట్లే.. ఇక్కడ ఓ మూగ జీవికి మరో మూగ జీవి సాయం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ చిన్ని ముళ్లపందిరోడ్డు మీదకు వచ్చింది. వాహనాల రద్దీ ఉండటంతో భయపడుతూనే రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో ముళ్లపందిఅవస్థలను గమనించిన కాకి.. దానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ముల్లపందిని వెనక నుంచి పొడుస్తూ ముందుకు తరుముతోంది. అయితే, సాయం చేద్దామని వచ్చిన కాకికి ఆ ముళ్లపందిచుక్కలు చూపించింది. ఒక అడుగు ముందుకు వేసి, వెంటనే భయంతో ముడుచుకుంటోంది. దీని చర్యతో కాకి తలప్రాణం తోకకు వచ్చినట్లయ్యింది. అయితే, ముల్లపందిని రోడ్డు దాటించేందుకు కాకి పడిన తాపత్రయం అంతా కారులోని ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 14, 2022 08:18 AM