Child Viral Video: తొల‌క‌రి జ‌ల్లులో ఎంజాయ్ చేస్తున్న చిన్నారి.! వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

|

Jul 01, 2023 | 7:59 PM

రుతుప‌వ‌నాల రాక‌తో దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ఉప‌శ‌మ‌నంగా చిరు జ‌ల్లులు ప‌ల‌క‌రిస్తుండ‌టంతో జ‌నం ఊర‌ట చెందుతున్నారు. ఇక తొల‌క‌రి జ‌ల్లులో త‌డుస్తూ ఓ చిన్నారి కేరింత‌లు కొడుతున్న వీడియోను పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మ‌హీంద్ర సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

రుతుప‌వ‌నాలు ఎట్టకేల‌కు ముంబైకి చేరుకోగా ఇంటి నుంచి తొల‌క‌రి జ‌ల్లుల‌ను ఆస్వాదించ‌డం ఎలా ఉంటుంద‌నేది ఈ వీడియో వెల్లడిస్తోంద‌ని ఆనంద్ మ‌హీంద్ర రాసుకొచ్చారు. ప్రతి భారతీయుడి మదిలో ఉండే ఆలోచనే ఇది. చిన్నారి తొల‌క‌రి జ‌ల్లుల‌ను ఎంజాయ్ చేయ‌డంలో ఏమాత్రం అలిసిపోడ‌ంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట దూసుకెళ్తోంది. నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ముంబైలో వానాకాలం అంటే కేవ‌లం వ‌ర్షాలే కాదు..ఓ ఫ‌న్, హంగామా, చిన్ననాటి జ్ఞాప‌కాల అనుభూతులు అంటూ ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, వ‌ర్షాకాలంలో ముంబై ఓ ఆట‌స్ధలంలా మారుతుంద‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేశారు. చిన్నత‌నంలో వ‌ర్షపు నీటిలో కాగిత‌పు ప‌డ‌వ‌లు వేసి సంద‌డి చేసే వార‌మ‌ని ఆ రోజులే అద్భుత‌మ‌ని మ‌రో యూజ‌ర్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..