Cheetah in Srisailam: శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.

|

Aug 16, 2024 | 10:14 AM

ఇటీవల పుణ్యక్షేత్రాల్లో వన్యప్రాణులు సంచారం ఎక్కువైంది. శ్రీశైలం మొదలు తిరుమల వరకూ పలు పుణ్యక్షేత్రాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తూ ఇటు భక్తులను, అటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆహారం కోసం అడవులను వదిలి ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది.

ఇటీవల పుణ్యక్షేత్రాల్లో వన్యప్రాణులు సంచారం ఎక్కువైంది. శ్రీశైలం మొదలు తిరుమల వరకూ పలు పుణ్యక్షేత్రాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తూ ఇటు భక్తులను, అటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆహారం కోసం అడవులను వదిలి ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద చిరుత కనిపించింది. ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా తృటిలో ఆ కుక్క తప్పించుకుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున పలు ఇళ్ల వద్ద చిరుతపులి సంచారం కనిపించింది. జనావాసాల్లో చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on