Simhachalem: సింహాచలం అప్పన్న హుండీలో రూ.100 కోట్ల చెక్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.?
ఎప్పటిలానే ప్రతీ 15 రోజులకు ఒకసారి హుండీ లెక్కించే ఆ దేవస్థానం అధికారులకు కనిపించిన ఓ చెక్ షాక్‌కు గురిచేసింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ కళ్లముందు సాక్షాత్కారం అవగానే పరాకామని సిబ్బంది బిత్తర పోయారు. షాక్ నుంచి తేరుకుని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దాంతో ఇప్పటివరకు వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థాన ఎన్నడూ జరగని ఆ వింతపై ఉన్నతాధికారులు అనుమానించలేదు సరికదా..
ఎప్పటిలానే ప్రతీ 15 రోజులకు ఒకసారి హుండీ లెక్కించే ఆ దేవస్థానం అధికారులకు కనిపించిన ఓ చెక్ షాక్‌కు గురిచేసింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ కళ్లముందు సాక్షాత్కారం అవగానే పరాకామని సిబ్బంది బిత్తర పోయారు. షాక్ నుంచి తేరుకుని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దాంతో ఇప్పటివరకు వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థాన ఎన్నడూ జరగని ఆ వింతపై ఉన్నతాధికారులు అనుమానించలేదు సరికదా… ఓ దశలో ఏకంగా ఆ భక్తుడికి దేవాలయం తరుఫున రాచమర్యాదలు చేసేందుకు సిద్ధమయ్యారు. సింహాచలం వరాహాలక్ష్మి నర్సింహ్మ స్వామి హుండీ లెక్కింపు సందర్భంగా ఒక భారీ విరాళాన్ని గుర్తించారు. షాక్ నుంచి తేరుకున్న కాసేపటికి అసలు వివరాలు సేకరించే పనిలో పడ్డారు దేవాదాయ శాఖ అధికారులు.
చెక్‌పై ఉన్న వివరాలను బట్టి బొడ్డేపల్లి రాధాకృష్ణకు చెందిన సేవింగ్స్ అకౌంట్ గా గుర్తించారు. ఎంవీపీ డబుల్ రోడ్డు బ్రాంచ్ పేరుతో సేవింగ్స్ అకౌంట్ చెక్ ద్వారా 100 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం పై ఉన్నతాధికారులకు తొలుత అనుమానం వచ్చింది. అందులోనూ చెక్‌పై వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానం పేరుతో రాసిన ఆ చెక్ పై మొదట 10 రూపాయలు అని రాసి కొట్టేసి మళ్లీ 100 కోట్ల రూపాయలని రాసి ఉన్నట్టు గుర్తించారు. అయితే హుండీలో 100 కోట్ల రూపాయల చెక్ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయించారు కొందరు. అక్కడ ఇంకోసారి షాక్ న్యూస్ వెలుగు చూసింది. ఆ అకౌంట్‌లో కేవలం 17 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో అసలు ఆ వ్యక్తి కావాలనే చేశారా.. ఆయన మానసిక పరిస్థితి ఏంటి… ఒక వేళ వేస్తే ఎందుకిలా వేశారు… ఈ వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు దేవస్థానం అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...