Three Horns Bull: వామ్మో..ఇదేంది.. ఈ ఎద్దుకి 3 కొమ్ములున్నాయ్.. ఇది నిజమేనా మీరే చెప్పండి..
సాధారణంగా ఎక్కడైనా ఎద్దులు, మేకలు, ఆవులకు రెండు కొమ్ములు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే.. అదే మూడు కొమ్ములు ఉంటే ఎలా ఉంటుంది.? అదెలా సాధ్యం అంటారా..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మైదానంలో నల్లని ఎద్దు ఒకటి నిలుచుని ఉంది. అది చాలా పెద్ద కొమ్ములతో ఉంది. అదికూడా 3 కొమ్ములతో వింతగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోపై కొందరు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జన్యు మార్పు కారణంగా ఈ ఎద్దుకు మూడు కొమ్ములు వచ్చి ఉంటాయని కొందరంటే.. మరికొందరు మాత్రం ఇది కచ్ఛితంగా మార్ఫింగ్ వీడియో అని కొట్టి పారేస్తున్నారు. ఎవరో కావాలనే వీడియోను ఎడిటింగ్ చేసి ఇలా పోస్ట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఎంత వరకు నిజం ఉందనే విషయం మాత్రం నిర్ధారణ కాలేదు. కానీ వీడియో మాత్రం నెట్టింట దూసుకుపోతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..