అర్ధరాత్రి ఇంటి తలుపులు కొడుతున్న లేడీ దెయ్యం.. గజ్జుమంటున్న రాంపూర్ జనం
అర్థరాత్రి అందరు పండుకున్నంక ఎవ్వలో అచ్చి కాలింగ్ బెల్ కొట్టిండ్రు.. నిద్రమత్తుల్నే లేశిపోయి తల్పు తీశిండ్రు..ఎద్రుంగ ఒకామే జుట్టు ఇరవోస్కోని.. నాల్కే బైటికి పెట్టి...
అర్థరాత్రి అందరు పండుకున్నంక ఎవ్వలో అచ్చి కాలింగ్ బెల్ కొట్టిండ్రు.. నిద్రమత్తుల్నే లేశిపోయి తల్పు తీశిండ్రు..ఎద్రుంగ ఒకామే జుట్టు ఇరవోస్కోని.. నాల్కే బైటికి పెట్టి… ఊ ఆ అన్కుంట తల్కయ ఊపుతుంది. పెయిమీద ఏం బట్టల్లేకుంట నిలవడి పిస పిస చేస్తుంది.. అప్పుడు మీ పీలింగు ఎట్లుంటది.. పీలింగా… పాడ. పై ప్రాణాలు పైన్నే పోతయి తల్లి.. దెయ్యం అటైర్తోటి అస్తే ఎవ్వలైన దా అమ్మ అని వెల్కం చేస్తరా..? గుండే గుంటుకు గొట్టుడే అయితదని అంటున్నరు గద..నేను చెప్పింది అవద్దం కాదు..నిజమే.. ఉత్తర ప్రదేశ్లున్న రాంపూర్ల గిదే కథైతుందట .. ఇగీడ మంచిగ సూడుర్రి.. ఒక ఆడామే అర్థరాత్రి జుట్టు ఇరపోస్కోని ..పెయిమీద నూలుపోగు లేకుంట వాడకట్టుల పొంటి నడ్శిపోతున్నది.. వో ఇంటిముంగట్కి పోయి కాలింగ్ బెల్లు కొట్టింది.. జెర్శేపైనంక ఆడ్కెంచి జప్పున ఉర్కింది..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

