Punjab: అంతా ఒకే అనుకుంటే.. పట్టించేసిన బయోమెట్రిక్‌.! ప్రియురాలి కోసం ప్రియుడి త్యాగం.

|

Jan 17, 2024 | 6:08 PM

యువతీయువకుల ప్రేమ ఎంతటి పనినైనా చేయిస్తుందంటారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలి కోసం ఓ వ్యక్తి అమ్మాయిగా రెడీ అయ్యి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. బయోమెట్రిక్‌తో దొరికిపోయి చివరకు కటకటాలపాలయ్యాడు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెన్స్‌.. జనవరి 7న మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ పరీక్ష నిర్వహించింది.

యువతీయువకుల ప్రేమ ఎంతటి పనినైనా చేయిస్తుందంటారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలి కోసం ఓ వ్యక్తి అమ్మాయిగా రెడీ అయ్యి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. బయోమెట్రిక్‌తో దొరికిపోయి చివరకు కటకటాలపాలయ్యాడు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెన్స్‌.. జనవరి 7న మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ పరీక్ష నిర్వహించింది. దీనికి పరమ్‌జీత్‌ కౌర్‌ అనే యువతి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆమె స్థానంలో పరీక్ష రాసేందుకు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అంగ్రేజ్‌ సింగ్‌ వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అమ్మాయిల డ్రెస్‌, బొట్టు, గాజులు, లిప్‌స్టిక్‌ పెట్టుకుని అచ్చం ఆమెలా రెడీ అయ్యాడు. అంతేనా.. తానే పరమ్‌జీత్‌ అని నమ్మించేందుకు ఆడవేషంలో ఉన్న తన ఫొటోలతో నకిలీ ఓటర్‌కార్డు, ఆధార్‌ కార్డు సృష్టించాడు. కానీ, చివరకు బయోమెట్రిక్‌ దగ్గర దొరికిపోయాడు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో అవి మ్యాచ్‌ కాకపోవడంతో అనుమానం వచ్చిన యూనివర్సిటీ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పరీక్ష రాసేందుకు వచ్చిన వ్యక్తి అబ్బాయి అని తెలిసి అందరూ అవాక్కయ్యారు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos