Araku: కుంపటే చంపేసిందా.? నానమ్మ, మనవడు మృతిపై వీడని మిస్టరీ..

|

Dec 06, 2024 | 12:19 PM

అల్లూరి జిల్లా అరకు లోయ అటవీశాఖ క్వార్టర్స్‌లో విషాదం చోటుచేసుకుంది. నానమ్మ చిలకమ్మ, మనవడు నాని అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీశాఖ క్వార్టర్స్‌లో సుమారు గత ఎనిమిది ఏళ్లకుపైగా కొర్ర చిలకమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం కూలి పనుల తర్వాత ఇంటికి వచ్చి భోజనాలు ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు.

ఒక గదిలో ఇతర కుటుంబ సభ్యులు నిద్రపోగా మరో గదిలో నానమ్మ చిలకమ్మ, మనవడు నాని నిద్రపోయారు. ఉదయం కుటుంబ సభ్యులు నానమ్మ మనవడిని లేపేందుకు ప్రయత్నించగా వారు విగత జీవులై పడి ఉన్నారు. రాత్రి సంపూర్ణ ఆరోగ్యంతో నిద్రపోయిన నానమ్మ, మనవడు ఉదయాన్నే విగత జీవులై కనిపించడం తండ్రి బాలరామ్‌ గుర్తించాడు. కుటుంబ సభ్యులను ఈ ఉదంతం షాక్‌కు గురిచేసింది. నానమ్మ, మనవడు మృతి చెందడానికి రాత్రి చలి నుంచి ఉపశమనం కోసం కుంపటి పెట్టుకున్నారు. ఆ కుంపటి పొగతో ఊపిరాడక మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే కేవలం పొగ పీల్చడంతో చనిపోతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి విచారణ వేగవంతం చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాలరావు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.