Srisailam: శ్రీశైలంలో ఎట్టకేలకు బోనులో చిక్కిన ఎలుగుబంటి.. వైరల్ అవుతున్న వీడియో.

|

Aug 21, 2023 | 8:51 AM

గత 2 రోజులుగా శ్రీశైలం శిఖరం సమీపంలోని జనాల్ని, భక్తుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు పట్టుబడింది. ఎలుగు సంచారం వార్త తెలిసిన వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ శిఖరేశ్వరం సమీపంలో 3బోన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ తెల్లవారు జామున ఓ బోనులో పట్టుబడింది ఆ ఎలుగుబంటి.బోనులో చిక్కిన ఎలుగుబంటిని వెంటనే వెలుగోడుకు అటవీ ప్రాంతానికి తరలించారు.

గత 2 రోజులుగా శ్రీశైలం శిఖరం సమీపంలోని జనాల్ని, భక్తుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు పట్టుబడింది. ఎలుగు సంచారం వార్త తెలిసిన వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ శిఖరేశ్వరం సమీపంలో 3బోన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ తెల్లవారు జామున ఓ బోనులో పట్టుబడింది ఆ ఎలుగుబంటి. బోనులో చిక్కిన ఎలుగుబంటిని వెంటనే వెలుగోడుకు అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ సురక్షితంగా వదిలిపెడతామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరించడంతో అధికారులు, భక్తులను అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అప్రమత్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనల దృష్ట్యాలో శ్రీశైలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...