Hyderabad: మొన్న నిజాంపేట్‌లో నేడు రాజేంద్రనగర్‌లో.. హడలెత్తిస్తున్న 9 అడుగుల కొండచిలువలు..
కొండచిలువలు అటవీ ప్రాంతాలనుండి గ్రామాల్లోకి చొరబడి జనాలను భయభ్రాంతులకు గురి చేసిన ఎన్నో సంఘటనలు మనం చూశాం. విలేజ్‌లో బోరు కొట్టినట్టుంది.. ఇప్పడు కొండచిలువలు నగరబాటపట్టాయి. హైదరాబాద్‌లో కొండచిలువలు జనాలను హడలెత్తిస్తున్నాయి. మొన్న నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఎన్ఆర్ఐ కాలనీలో సాయి ఎలైట్ అపార్ట్ మెంట్ లో 9 అడుగుల కొండచిలువ హల్ చల్ చేసింది.
కొండచిలువలు అటవీ ప్రాంతాలనుండి గ్రామాల్లోకి చొరబడి జనాలను భయభ్రాంతులకు గురి చేసిన ఎన్నో సంఘటనలు మనం చూశాం. విలేజ్‌లో బోరు కొట్టినట్టుంది.. ఇప్పడు కొండచిలువలు నగరబాటపట్టాయి. హైదరాబాద్‌లో కొండచిలువలు జనాలను హడలెత్తిస్తున్నాయి. మొన్న నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఎన్ఆర్ఐ కాలనీలో సాయి ఎలైట్ అపార్ట్ మెంట్ లో 9 అడుగుల కొండచిలువ హల్ చల్ చేసింది. ఇప్పుడు రాజేంద్రనగర్‌లో మరో భారీ కొండచిలువ జనాలను పరుగులు పెట్టించింది. రాజేంద్రనగర్ హసన్ నగర్ లో లారీ పార్కింగ్ వద్ద శబ్దాలు రావడంతో ఏమై ఉంటుందా అని లారీడ్రైవర్లు అంతా ఆ చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో వారికి సుమారు 9 అడుగుల పొడవున్ పెద్ద కొండచిలువ కనిపించింది. అదిరిపడిన ఆ డ్రైవర్లు పరుగులు తీశారు. డ్రైవర్ల ఆందోళనతో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు స్నేక్ క్యాచర్ సహాయంతో కొండచిలువను బంధించారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..