స్కూల్లో మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న చిన్నారి.. అంతలోనే..!

Updated on: Jul 23, 2025 | 3:35 PM

కరోనా పోతూ పోతూ.. మరో మహమ్మారిని అంటగట్టి వెళ్లిందా అనిపిస్తోంది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ మహమ్మారికి బలవుతున్నారు. బస్సు నడుపుతూ డ్రైవర్లు సీట్లోనే ఒరిగిపోతున్నారు.. పాఠాలు చెబుతూ మాస్టార్లు కుప్పకూలిపోతున్నారు.. గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుతూ యువ క్రికెటర్లు నేలకూలుతున్నారు.

అభం శుభం తెలియని చిన్నారులు సైతం అప్పటి వరకూ చలాకీగా ఆడుకున్న వారు ఒక్కసారిగా విగతజీవులుగా మారుతున్నారు. కారణమేదైనా ఇటీవల కాలంలో గుండెపోటు మహమ్మారిలా మారింది. గుండెపోటుతో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. రాజస్థాన్‌లోని ఓ పాఠశాలలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక పాఠశాలలోనే కుప్పకూలి మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని దాంతా పట్టణంలో జరిగింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని బాలిక గుండెపోటు లక్షణాలతో మృతి చెందడం అందరినీ విస్మయానికి గురి చేసింది. దాంతా పట్టణానికి చెందిన ప్రాచీ కుమారవత్ అనే బాలిక ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఉపాధ్యాయులు స్పందించి బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో సికార్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు లక్షణాలు కనిపించాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రాచీ ఆరోగ్యం సరిగా లేక మూడు రోజులుగా పాఠశాలకు రాలేదని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాలకు వచ్చిన రోజు మాత్రం బాలిక ఆరోగ్యంగానే కనిపించిందని ఆయన చెప్పారు. ఈ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా, తమ కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక.. డబ్బు లేకుండానే గ్యాస్ సిలిండర్లు

వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారో.. రోగాలకు రెడ్‌ కార్పెట్‌ పరిచినట్లే..

నాడు నైట్ వాచ్‌మెన్‌గా జీతం రూ.165… నేడు.. కోట్లు సంపాదిస్తున్న నటుడు

బెంగుళూర్ గుహలో పిల్లలతో రష్యన్ మహిళ.. వివరాల్లోకి వెళ్లగా ఖంగుతిన్న పోలీసులు..