Viral: అతని వయసు 82.. జైలు శిక్ష 383 ఏళ్ళు.. నేరం ఏంటో తెలుసా..? వీడియో.
తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్ లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ 1988 నవంబర్ 9న కేసు నమోదయింది. నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి 28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. నిందిదితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే నలుగురు నిందితులు మృతి చెందారు.
నకిలీ పత్రాలను సృష్టించి, మోసం చేసిన కేసులో తమిళనాడులోని కోయంబత్తూర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మోసానికి పాల్పడిన వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు 3 కోట్ల 32 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించింది. తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్ లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ 1988 నవంబర్ 9న కేసు నమోదయింది. నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి 28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. నిందిదితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే నలుగురు నిందితులు మృతి చెందారు. మరోవైపు, బతికున్న వారిలో కోదండపాణి అనే వ్యక్తి మినహా మిగిలిన ముగ్గురునీ జడ్జి నిర్దోషులుగా పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మూడు శిక్షలను కలిపితే మొత్తం 383 సంవత్సరాల శిక్ష అవుతుంది. ప్రస్తుతం కోదండపాణి వయసు 82 సంవత్సరాలు. దీంతో, ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పును వెలువరించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కోదండపాణిని పోలీసులు జైలుకు తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...