YouTube: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో 64 లక్షల వీడియోలు తొలగింపు..!

|

Sep 02, 2023 | 10:19 PM

యూట్యూబ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరిని వీడియోలతో తెగ ఆకట్టుకుంటుంది. దీని ద్వారా ఎంతోమంది బాగా సంపాదిస్తున్నారు. అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల ఏకంగా భారత్‌లో 19 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 2023 జనవరి నుంచి మార్చి వరకు దాదాపు 2 మిలియన్ల వీడియోలను తొలగించినట్లు సమాచారం.

యూట్యూబ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరిని వీడియోలతో తెగ ఆకట్టుకుంటుంది. దీని ద్వారా ఎంతోమంది బాగా సంపాదిస్తున్నారు. అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల ఏకంగా భారత్‌లో 19 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 2023 జనవరి నుంచి మార్చి వరకు దాదాపు 2 మిలియన్ల వీడియోలను తొలగించినట్లు సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల కంటే ఎక్కువ వీడియోలను తీసివేసింది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు అండ్ యూట్యూబ్ పాలసీలను ఎలా అమలు చేస్తుందనే దానిపై గ్లోబల్ డేటాను విడుదల చేసింది. ఇందులో తొలగించిన వీడియోల వివరాలు వెల్లడించింది. ఒక్క భారతదేశంలో 1.9 మిలియన్స్ మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ తీసివేసింది. అగ్రరాజ్యమైన అమెరికాలో 6లక్షల 54 వేల 968, రష్యాలో 4లక్షల 91 వేల 933, బ్రెజిల్‌లో 4లక్షల 49వేల 759 వీడియోలను తొలగించినట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..