600 కి.మీ. డ్రైవ్ చేసుకుంటూ ప్రియుడికోసం వచ్చింది..చివరకు వీడియో

Updated on: Sep 17, 2025 | 7:50 PM

ప్రేమకోసం ప్రేమికులు దేశాలు దాటి వస్తున్న..వెళ్తున్న ఘటనలు మనం చూశాం. కులం, మతం, ప్రాంతం, దేశాలతో సంబంధంలేకుండా తమ ప్రేమను చాటుతూ వివాహాలు చేసుకుంటున్నారు. కానీ అన్ని ప్రేమకథలూ ఇలా సుఖాంతం అవుతాయనుకుంటే పొరపాటే. అందుకు ఉదాహరణే ఈ ఘటన. సోషల్‌ మీడియాలో పరిచయాలు..వివాహేతర సబంధాలకు దారితీయడం.. ఆ తర్వాత హత్యల వరకూ వెళ్లడం ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఫేస్‌ బుక్‌లో పరియచమైన ప్రియుడికోసం ఏకంగా 600 కిలోమీటర్లు స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చింది ఓ మహిళ. చివరికి ప్రియుడి చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌ బర్మార్‌లో జరిగింది.

ఝున్‌ఝునుకు చెందిన ముకేశ్‌ కుమారి అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. 37 ఏళ్ల కుమారి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో బర్మార్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనరామ్‌తో ఆమెకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆల్రెడీ పెళ్లయిన మనరామ్‌, తన భార్యతో మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో కుమారితో ఫేస్‌బుక్‌ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ ముకేశ్‌ కుమారి మనరామ్‌ని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సెప్టెంబరు 10న, మనరామ్‌ను కలిసేందుకు ఆమె తన కారులో ఝున్‌ఝును నుంచి బర్మార్‌కు వచ్చింది. నేరుగా మనరామ్‌ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పింది. అదే రోజు సాయంత్రం, మాట్లాడదామని చెప్పి ముకేశ్‌ను మనరామ్‌ కారులో బయటకు తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో పెళ్లి ప్రస్తావన తెచ్చింది కుమారి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మనరామ్‌, కారులో ఉన్న ఇనుప రాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దాంతో ముకేశ్‌కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో