ఐదు జాతీయ రహదారులతో పాటు 475 రోడ్లు బంద్‌ .. ఎక్కడంటే ??

|

Feb 06, 2024 | 10:07 PM

నూతన సంవత్సరం ప్రారంభమైంది మొదలు హిమాచల్ ప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ‍ప్రయాణానికి ప్లాన్‌ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా భారీ మంచు కురుస్తున్న కారణంగా ఐదు జాతీయ రహదారులతో సహా 475 రోడ్లను రాష్ట్రంలో అధికారులు మూసేశారు. ఎలాంటి రాకపోకలకు అవకాశం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.

నూతన సంవత్సరం ప్రారంభమైంది మొదలు హిమాచల్ ప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ‍ప్రయాణానికి ప్లాన్‌ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా భారీ మంచు కురుస్తున్న కారణంగా ఐదు జాతీయ రహదారులతో సహా 475 రోడ్లను రాష్ట్రంలో అధికారులు మూసేశారు. ఎలాంటి రాకపోకలకు అవకాశం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. హిమపాతం కారణంగా చంబాలో 56, కాంగ్రాలో ఒకటి, కిన్నౌర్‌లో ఆరు, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మూసుకుపోయాయని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. అంతకుముందు శనివారం రాష్ట్రంలో 504 రోడ్లను మూసివేశారు. వీటిలో నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి. అంతేకాకుండా పలు చోట్ల మంచు కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హృతిక్ రోషన్ ఫైటర్‌ సినిమాకు లీగల్‌ నోటీసులు.

బాలు మళ్లీ పాడతారా ?? రెహమాన్ ఆ మ్యాజిక్ చేస్తారా ??

బురఖాతో సొంత ఇంటిలోనే చోరీ !! కారణం ఏంటంటే ??

బెల్లం కొనాలన్నా ఆధార్ కార్డ్ చూపించాలా ?? ఎందుకలా ??

గుడ్‌న్యూస్‌.. క్యాన్సర్‌కు టీకా రెడీ.. ట్రయల్స్‌లో మంచి ఫలితాలు