TV9 Telugu

06 February 2024

హృతిక్ రోషన్ ఫైటర్‌ సినిమాకు లీగల్‌ నోటీసులు.

హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె నటించిన ‘ఫైటర్’. జనవరి 25న విడుదలైన మంచి వసూళ్లను సాధిస్తోంది.

అదే సమయంలో ఫైటర్‌ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి.

గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది.

కమర్షియల్‌ టచ్‌ ఇచ్చేందుకు సినిమాలో రొమాంటిక్ సీన్లు, బికినీ డ్యాన్స్‌లు, నటీనటుల మధ్య ముద్దులు జోడించారు.

ఒక సన్నివేశంలో, హృతిక్ మరియు దీపికా పదుకొణె ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు.

ఈ సన్నివేశంపై ఎయిర్ ఫోర్స్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాపై కేసు వేశాడు.

యూనిఫాం ధరించి ముద్దులు పెట్టుకునే సన్నివేశం వైమానిక దళానికి విరుద్ధమని అసోం ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్య దీప్ దాస్ మండిపడ్డాడు.

వైమానిక దళం అనుసరించే నియమాలు, యూనిఫాంకు ఇది అవమానమంటూ ఫైటర్‌ చిత్ర బృందానికి లీగల్‌ నోటీసులు పంపాడు.