squirrel: అట్లుంటది మనతోని..! ఉడుత చేసిన అల్లరి పనికి.. 3 వేల ఇళ్లకు తీవ్ర ఇబ్బంది ..!

Updated on: Jun 28, 2022 | 8:52 PM

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉడుత చేసిన పని కారణంగా 3 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు అర్థగంటకు పైగా విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో అనేక కార్యక్రమాలకు నిలిచిపోయాయి.


అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉడుత చేసిన పని కారణంగా 3 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు అర్థగంటకు పైగా విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో అనేక కార్యక్రమాలకు నిలిచిపోయాయి. వ్యాపార, ప్రభుత్వ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఉడత వల్ల కరెంట్ నిలిచిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ బాబూ నార్త్ కరోలినాకు చెందిన యుటిలిటీ కంపెనీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటానికి ఉడుతే కారణమని ప్రకటించింది. ఆ కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. జూన్ 22న ఉదయం ఒక ఉడుత పవర్ సప్లై వైరింగ్‌లోకి వచ్చి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించింది. దాంతో దాదాపు అరగంట పాటు డౌన్‌టౌన్‌లోని వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు, పౌరుల నివాసాలు సహా మొత్తం 3,000 మంది కస్టమర్లకు తీవ్ర ఇబ్బంది కలిగింది. కాగా, పవర్ సప్లయ్‌కి ఆటంకం కలిగిన వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. దాదాపు అరగంటపాటు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఉడుత చేసిన పని కారణంగా.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు ఎఫెక్ట్ అయ్యాయని, ఇ-సేవల్లో డీడ్స్ రిజిస్టర్, ప్లానింగ్, ట్యాక్స్ కలెక్షన్స్, హెల్త్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ పరిపాలన, కుటుంబ న్యాయ కేంద్రం, ఎన్నికల సేవలు, ఆర్థిక సేవలు ప్రభావితమయ్యాయని ఉత్తర కరొలినా విద్యుత్ సంస్థ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 28, 2022 08:52 PM
Follow Us