పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్‌.. అలా ఎలా పెట్టావ్ పాప

Updated on: Feb 15, 2025 | 6:37 PM

మాదకద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తున్న ముగ్గురు విదేశీయులను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. 26 కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జనవరి 24న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి... అనంతరం కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. జనవరి 24న సావోపాలో నుంచి వచ్చిన ఇద్దరు బ్రెజిల్‌ మహిళలు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ తనిఖీలను తప్పించుకొనేందుకు గ్రీన్‌ చానల్‌ దాటుతుండగా పట్టుకున్నారు.

డ్రగ్స్‌ క్యాప్సూల్స్‌ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసి 100 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. వాటిలో కొకైన్‌గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది. ఆ డ్రగ్స్‌ బరువు 802 గ్రాములు కాగా, వీటి విలువ రూ.12.03 కోట్లు ఉంటుందని అంచనా. అదే రోజు అడిస్‌ అబాబా నుంచి వస్తున్న కెన్యా ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. విచారణలో కొకైన్‌ క్యాప్సూల్స్‌ మింగినట్లు అంగీకరించాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి మొత్తం 70 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. క్యాప్సుల్స్‌లో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్‌ ఉన్నట్లు గుర్తించారు. రూ.14 కోట్ల విలువైన డ్రగ్స్‌గా గుర్తించారు. ముగ్గురినీ అరెస్టు చేసి.. ఈ ఆపరేషన్‌ వెనుక ఉన్న మాదకద్రవ్యాల సిండికేట్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?

దువ్వాడ, దివ్వెల వారి సమర్పణలో.. వాలెంటైన్స్‌ డ్యూయెట్‌.. చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా

Brahma Anandam: బ్రహ్మానందం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్టా ?? ఫట్టా ??

విశ్వక్‌సేన్‌ లైలా సినిమా హిట్టా? ఫట్టా? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి

పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??

Published on: Feb 15, 2025 06:36 PM