జాలర్ల వలలో చిక్కిన అసలు సిసలైన చేప.. అబ్బా అదృష్టం ఆంటే ఇతనిదే

Updated on: Jul 03, 2025 | 5:39 PM

రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరడంతో జలకళ సంతరించుకున్నాయి. వరద ఉధృతికి నదుల్లోని చేపలు ప్రాజెక్టుల్లోకి కొట్టుకురావటంతో మత్స్యకారులకు కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది.

ఎప్పటిలాగే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు కడెం ప్రాజెక్టులో వేట ప్రారంభించారు. ఈ క్రమంలో వారి వలలో భారీ కృష్ణబొచ్చు చేప చిక్కింది. సాధారణంగా బొచ్చుచేపలు ఇంత భారీగా పెరగడం అరుదు. కాగా జాలర్లకు చిక్కిన ఈ చేప ఏకంగా 22 కిలోల బరువు తూగడంతో జాలర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు, ఈ భారీ చేపను చూసి స్థానికులు, ఇతర మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. ఇంత భారీ చేపలు ప్రాజెక్టులో అరుదుగా లభిస్తాయని మత్స్యకారుడు ముత్యాలు తెలిపాడు. కాగా, చేపలు కొనేందుకు వచ్చిన అనేక మంది కొనుగోలు దారులు ఈ భారీ చేపను పట్టుకొని ఫోటోలు దిగారు. ఈ చేప మార్కెట్‌లో భారీ ధర పలికే అవకాశం ఉందని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: తనతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు.. అసలు నిజం బయటపెట్టిన సమంత

డ్రైనేజీ నుండి వింత శబ్దాలు.. దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు పరుగో పరుగు

కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. అనుమానం తో టెస్ట్ చేయగా.. ఖంగు తిన్న డాక్టర్స్