Eggs World Record: మునివేళ్లపై 18 కోడిగుడ్లు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు.! వైరల్ అవుతున్న వీడియో..
సాధారణంగా ఒక చేతిలో ఎన్ని గుడ్లను పట్టుకుంటారు? ఒకటి లేదా రెండు.. మరీ గరిష్ఠంగా అయితే ఓ 4 లేదా 5 గుడ్లను చేత్తో పట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ గుడ్లను అరచేతిలో పట్టుకోవడం అసలు సాధ్యం కాదు. అయితే ఇరాక్‌కు చెందిన ఇబ్రహీం అనే యువకుడు కోడిగుడ్లతో అద్భుతం సృష్టించాడు.
సాధారణంగా ఒక చేతిలో ఎన్ని గుడ్లను పట్టుకుంటారు? ఒకటి లేదా రెండు.. మరీ గరిష్ఠంగా అయితే ఓ 4 లేదా 5 గుడ్లను చేత్తో పట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ గుడ్లను అరచేతిలో పట్టుకోవడం అసలు సాధ్యం కాదు. అయితే ఇరాక్‌కు చెందిన ఇబ్రహీం అనే యువకుడు కోడిగుడ్లతో అద్భుతం సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 గుడ్లను మునివేళ్లపై నిలబెట్టి అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఇబ్రహీం ప్రతిభకు ముగ్ధులైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఫిదా అయ్యారు. కాగా దీనిపై స్పందించిన ఇబ్రహీం సాధనతోనే ఈ అరుదైన ఫీట్ సాధ్యమైందంటున్నాడు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి. ఇబ్రహీం ప్రతిభను మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా కొన్ని నెలల క్రితం ఇబ్రహీం లాగే జాక్ హారస్ అనే వ్యక్తి చేతి వెనక భాగంపై 18 గుడ్లను నిలబెట్టి వార్తల్లో కెక్కాడు.
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

