Plane Crash: ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

|

Jan 01, 2025 | 4:41 PM

దక్షిణ కొరియాలో తాజాగా ఘోర విమాన ప్రమాదం జరిగింది. థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం ల్యాండ్‌ అవుతూ అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

మొత్తం 175మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. ఇద్దరు సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు. 179 మంది మృతి చెందినట్లు యాంహాప్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటనలో విమానం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. ఆదివారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి లాండింగ్‌ గేర్‌ వైఫల్యమే కారణమని భావిస్తున్నారు. ఈ విమానం అప్పటికే ల్యాండింగ్‌కు యత్నించి విఫలమైందని అధికారులు అన్నారు. ఇది నేలపైకి దిగిన తర్వాత రన్‌వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. ఇది ఎయిర్‌పోర్టు గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు తెలిపారు.

విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్‌ గేర్‌, టైర్లు పని చేయలేదని అధికారులు చెప్పారు. ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. దీనిని బలపర్చేలా విమానం ల్యాండింగ్ యత్నించే సమయంలో ఓ ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటకు వచ్చిన దృశ్యాలను స్థానిక టెలివిజన్‌ ఛానల్‌ ప్రసారం చేసింది. ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ సాంగ్‌ మోక్‌ స్పందించారు. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంటీరియర్‌, ల్యాండ్‌ మినిస్టర్లకు, పోలీసులు, అగ్నిమాపక శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు. ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.