Crime: ఆ పనికి ఒప్పుకోలేదని బాలికను రైలు కింద తోసేసిన దుండగులు..వీడియో.
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుండగులు బాలిక ప్రతిఘటించడంతో ఆమెను తీసుకెళ్లి రైలు కింద పడేశారు. తీవ్రగాయాలతో బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన బరేలి సిటీలో అక్టోబరు 10న చోటుచేసుకుంది. బాధిత యువతి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబరు 10న సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుండగులు బాలిక ప్రతిఘటించడంతో ఆమెను తీసుకెళ్లి రైలు కింద పడేశారు. తీవ్రగాయాలతో బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన బరేలి సిటీలో అక్టోబరు 10న చోటుచేసుకుంది. బాధిత యువతి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబరు 10న సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది యువకులు ఆమెను అడ్డుకున్నారు. అసభ్యంగా ప్రవర్తించారు. వారి చర్యలను తీవ్రంగా ప్రతిఘటించిన బాలికను అందరూ కలిసి ఓ రైలు ముందు పడేశారు. రైల్వే క్రాసింగ్ వద్ద తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు గుర్తించి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయిన బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ చదువుతున్న తన కూతురిపై ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి వేధింపులకు పాల్పడ్డారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఆయన ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసుల్ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..