Shimla: సిమ్లాకు ల‌క్ష మంది టూరిస్టులు.! భారీగా ట్రాఫిక్ జామ్..

|

Dec 30, 2023 | 8:39 PM

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడుతోంది. ఇయ‌ర్ ఎండ్ సెల‌బ్రేష‌న్స్ కోసం సిమ్లాకు టూరిస్టులు పోటెత్తుతున్నారు. గత కొంత కాలంగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతోంది. న్యూ ఇయర్ రావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో సిమ్లా, మనాలి, కసోల్ లో భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. జస్ట్ మూడు రోజుల్లోనే లక్షల సంఖ్యలో వెహికిల్స్ సిమ్లాలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడుతోంది. ఇయ‌ర్ ఎండ్ సెల‌బ్రేష‌న్స్ కోసం సిమ్లాకు టూరిస్టులు పోటెత్తుతున్నారు. గత కొంత కాలంగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతోంది. న్యూ ఇయర్ రావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో సిమ్లా, మనాలి, కసోల్ లో భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. జస్ట్ మూడు రోజుల్లోనే లక్షల సంఖ్యలో వెహికిల్స్ సిమ్లాలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రోహ్ తంగ్ లోని ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్‌ గుండా మూడు రోజుల్లో దాదాపు 55,000 వేల కంటే ఎక్కువ వెహికిల్స్ సిమ్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఓ వైపు పొగమంచు, మరోవైపు వేల సంఖ్యలో పర్యాటకుల రావడంతో ఆ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిజ్ స్తంభించిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో.. టూరిస్టులంతా తమ వాహనాలను రోడ్ల పక్కనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో లక్షకు పైగా వెహికిల్స్ సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక, ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడటం కోసం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించామని ఎస్పీ తెలిపారు. సుమారు 300 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31తో పాటు జనవరి 1కి ఔలిలోని అన్ని హోటళ్ల బుకింగ్‌లు దాదాపు పూర్తి అయ్యాయి. నైనిటాల్‌లో కూడా 70 శాతానికి పైగా హోటళ్ల బుకింగ్ పూర్తైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.