నడక నేర్చే వయసులో స్విమ్మింగ్ !! చేపలా ఈదుతున్న 16 నెలల బేబీ !!

|

Oct 14, 2022 | 9:01 AM

స్విమ్మింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. శరీరంతో పాటు మనసుకు కూడా మంచి వ్యాయామం అందిస్తుంది. అయితే ఈత కొట్టడం అంత తేలికైన పని కాదు. ఏ వ్యక్తిలో సహజంగా రాదు.

స్విమ్మింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. శరీరంతో పాటు మనసుకు కూడా మంచి వ్యాయామం అందిస్తుంది. అయితే ఈత కొట్టడం అంత తేలికైన పని కాదు. ఏ వ్యక్తిలో సహజంగా రాదు. సాధన చేస్తే మాత్రం.. స్విమ్మింగ్ చేయడం ఈజీనే. ప్రస్తుతం చాలా మంది పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే కొంచెం వయసు వచ్చిన తర్వాత ఈత కొట్టడం అభ్యసిస్తారు. కానీ ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి ఈత కొట్టడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కేవలం 16 నెలల చిన్నారి స్విమ్మింగ్ పూల్‌లో ఆనందంగా ఈత కొడుతుంది. వాస్తవానికి నెలల పిల్లలు నడవడం, పరుగెత్తడం కూడా సరిగా నేర్చుకోలేని వయసు.. అలాంటి వయసులో ఈ చిన్నారి ఈత కొట్టడం అశ్చర్యానికి గురి చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారిని చూస్తుంటే అస్సలు చిన్నపిల్లలా అనిపించదు.. ఏదో స్విమ్మింగ్ ఎక్స్‌పర్ట్‌లా.. నీటిలో చేపలా ఈదుతోంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 120 ఏళ్లుగా.. ఎక్కడుందో తెలుసా ??

మహిళ కడుపులో కత్తెరలు !! ఎలా చేరాయో తెలిస్తే !!

ఇంటికి కాపలా కాస్తున్న భారీ నాగుపాము !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

టిట్ ఫర్ టాట్ అంటే ఇదే.. మోసం చేయాలనుకుంటే ఇలానే మోసపోతారు !!

Published on: Oct 14, 2022 09:01 AM