Vijayawada: విజయవాడలో దంచికొట్టిన వాన.. విరిగిపడ్డ చెట్లు

Updated on: Oct 29, 2025 | 5:40 PM

తుఫాను మొంథా ప్రభావంతో విజయవాడ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు దంచికొట్టాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్, కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి కూలిన చెట్లను, నిలిచిన నీటిని తొలగిస్తూ రోడ్లను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

తుఫాను మొంథా ప్రభావం విజయవాడపై తీవ్రంగా పడింది. నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, భారీ ఈదురు గాలుల కారణంగా అనేక చెట్లు కూలిపోయాయి. NTR జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట కూడా భారీ చెట్లు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లిన చెట్లను తొలగించడంతో పాటు, రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని క్లియర్ చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత రాత్రి నుంచే అధికారులు అప్రమత్తమై 24/7 బృందాలతో దాదాపు 150 చెట్లను తొలగించినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాగులో చిక్కుకున్న వ్యక్తిని గ్రామస్థులు ఎలా కాపాడారో చూడండి

మీ డబ్బు కాదు.. పరామర్శ కావాలి

తీరం దాటిన మొంథా తుఫాను.. అల్లకల్లోలంగా సముద్రాలు

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే ??

రైలు నుండి జారిపడిన యువకుడు.. క్షణంలో..