AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

Phani CH
|

Updated on: Nov 02, 2026 | 12:21 PM

Share

విశాఖపట్నంలోని యారాడ డాల్ఫిన్ హిల్స్ నేవీ క్వార్టర్స్‌లో తీగజాతి మొక్కల మధ్య ప్రమాదకరమైన గ్రీన్ పిట్ వైపర్ కనిపించింది. ఆకుల చాటున దాగి ఉన్న పామును గుర్తించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించగా, ఆయన పామును సురక్షితంగా పట్టుకుని మరో ప్రాంతానికి తరలించారు. మొక్కలు, పొదలను శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇళ్ల వెనుక ఉన్న మొక్కలు, తీగలను శుభ్రం చేసేటప్పుడు లేదంటే ఏవైనా ఆకులు తెంచాలని చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..విశాఖపట్నంలోని యారాడ డాల్ఫిన్ హిల్స్ నేవీ క్వార్టర్స్‌లో తాజాగా జరిగిన ఒక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. అసలేం జరిగిందంటే…ఇంటి బయట ఉన్న తీగజాతి మొక్కల దగ్గరకు వెళ్లిన కుటుంబ సభ్యులకు ఏదో కదులుతున్నట్లు అనుమానం వచ్చింది. ఏంటా అని దగ్గరకు వెళ్లి పరిశీలించేసరికి వారి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కంటపడింది. పసుపు, ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో కూడిన ఒక ప్రమాదకరమైన పాము చెట్టు కొమ్మల మధ్య, ఆకుల చాటున మాటు వేసి ప్రశాంతంగా కూర్చుని ఉంది. అదిచూసి ఆ కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. వెంటనే తేరుకుని స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంతో నైపుణ్యంతో కొమ్మల మాటున దాక్కున్న ఆ పామును ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బంధించి మరో ప్రాంతానికి తరలించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. నాగరాజు పట్టుకున్న ఆ పామును ‘గ్రీన్ పిట్ వైపర్’గా గుర్తించారు. ఇవి ఎక్కువగా చెట్లు, పొదలు, దట్టమైన అడవుల్లో జీవించే అత్యంత విషపూరితమైన సర్పాలు. ఇవి సాధారణంగా ముదురు లేదా లేత ఆకుపచ్చ, పసుపు వర్ణంలో ఉండి.. చెట్ల ఆకుల్లో ఇట్టే కలిసిపోతాయి. అందువల్ల ఇవి త్వరగా ఎవరి కంటికీ కనిపించవు. వీటి కాటుకు గురైతే తీవ్రమైన నొప్పి, వాపు, రక్తస్రావం వంటి ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఎవరినైనా కాటు వేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం తీసుకోవాలి. సాధారణంగా ఇళ్ల దగ్గర కనిపించే విషం లేని ‘గ్రీన్ వైన్ స్నేక్’ కు, ఈ గ్రీన్ పిట్ వైపర్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. వైన్ స్నేక్ చాలా సన్నగా, పొడవుగా ఉండి పదునైన ముక్కును కలిగి ఉంటుంది. కానీ, గ్రీన్ పిట్ వైపర్ తల త్రిభుజాకారంలో, కాస్త దృఢమైన శరీరంతో ఉంటుంది. ఇవి సాధారణంగా మొక్కలు, చెట్లపై ఉండే కీటకాలను, చిన్నపాటి ప్రాణులను తమ ఆహారంగా మలుచుకుంటాయి. ఇళ్ల ఆవరణలో మొక్కలు, పొదలను శుభ్రం చేసేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

Follow Us