TTD: అర్చకులకు టీటీడీ శిక్షణ ప్రారంభం
సనాతన ధర్మాన్ని, శాస్త్ర సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఇన్చార్జి ఈఓ వెంకయ్య చౌదరి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పునఃశ్చరణ శిక్షణా తరగతులను ప్రారంభించారు. అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులకు నిర్వహించే ఈ శిక్షణ ద్వారా పూర్వీకుల వారసత్వాన్ని, వైదిక క్రియలను ప్రస్తుత సాంకేతికతతో జోడించి పరిరక్షించడం, ఆలయ సంప్రదాయాలను పవిత్రంగా నిర్వహించడంపై అవగాహన కల్పిస్తారు.
సనాతన ధర్మాన్ని, శాస్త్ర సాంప్రదాయాలను వారసత్వ సంపదగా కాపాడుతూ భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీటీడీ ఇన్చార్జి ఈఓ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అర్చకులు, పరిచారకులు మరియు వేదపారాయణదారుల కోసం ఏర్పాటు చేసిన మూడు రోజుల పునఃశ్చరణ శిక్షణా తరగతులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ … వేల ఏళ్లుగా మన పూర్వీకులు అందించిన సనాతన ధర్మానికి ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి పరిరక్షించుకోవాలని సూచించారు. టీటీడీ పరిధిలోని 61 ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న 35 మంది అర్చకులు, పరిచారకులు, 15 మంది వేద పారాయణదారులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ఆలయాల్లో నిత్యం నిర్వహించే కైంకర్యాలను మరింత శుద్ధిగా, నియమబద్ధంగా నిర్వహించేందుకు ఈ తరగతులు దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు. మూడు రోజుల పాటు సాగే ఈ శిక్షణలో అనేక కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం వైఖానస ఆగమ పరిచయం, నిత్య పూజా విధానాలు, పంచసూక్తాలు ఉంటాయి. వైదిక క్రియల్లో భాగంగా అగ్ని ప్రతిష్టాపన, కల్యాణోత్సవ హోమాలు, సంధ్యావందనం వివరిస్తారు. భాషా పరిజ్ఞానంలో భాగంగా సంస్కృత ఉచ్ఛారణ, మంత్ర పఠనంలో మెళకువలపై అవగాహన కల్పిస్తారు. ఇక ఆలయ సంప్రదాయాల విషయానికి వస్తే.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాల విశిష్టత, జ్యోతిష్య శాస్త్రం గురించి వివరిస్తారు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి మహనీయులు అందించిన సంప్రదాయాలను భక్తులకు చేరవేయడంలో ఈ శిక్షణ కీలకమని వేద వర్సిటీ వీసీ ఆచార్య రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని మాడ్యూల్స్ రూపొందిస్తామని ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్త బ్రహ్మోత్సవానుక్రమణికా’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు, వేదాలు-యోగ విశిష్టతపై ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని అధికారులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆగమ సలహాదారులు భావనారాయణ చార్యులు, ప్రిన్సిపాల్ శివ సుబ్రహ్మణ్యం అవధాని తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి
భూమి కింద మిస్సైల్ బేస్.. ప్రపంచానికి చాటిన’ఇరాన్’
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..
సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు