వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్
వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త! 2026 జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ రైల్వే ఈ సన్నాహాలను ప్రకటించింది. నాన్-ఏసీకి అమృత్ భారత్, ఏసీకి వందే భారత్ స్లీపర్ రైళ్లతో పాటు, టికెట్ అక్రమాలను అరికట్టడానికి ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి రైల్వే నిరంతరం కృషి చేస్తోంది.
వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. కొత్త ఏడాది మొదటి నెలలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2026 జనవరిలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. రైలు ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు త్వరలోనే వందే భాతర్ స్లీపర్ రైలు రానుందని తెలిపింది. ఇప్పటికే ఈ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్స్ పూర్తవ్వగా.. దాని ఆధారంగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆ మార్పులు దాదాపుగా పూర్తవ్వడంతో కొత్త ఏడాది ప్రారంభంలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. భారత్‌లో రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగపర్చేందుకు సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇప్పటికే నాన్ ఏసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అమృత్ భారత్ రైళ్లను తీసుకొచ్చామని, త్వరలోనే ఏసీలో ప్రయాణించేవారి కోసం వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ నెల 26 నాటికి దేశవ్యాప్తంగా 164 వందే భారత్ సర్వీసులు సేవలు అందిస్తున్నాయని, ఈ ఏడాది 42 కొత్త ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేశారని వివరించింది. మరోవైపు, ఈ ఏడాది రైల్వే టికెటింగ్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకోకుండా పారదర్శకత తీసుకొచ్చే చర్యలు చేపట్టినట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న 5.73 కోట్ల అనుమానాస్పద ఐఆర్‌సీటీసీ అకౌంట్లను గుర్తించి బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. తత్కాల్ టికెట్లలో అక్రమాలు చోటుచేసుకోకుండా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత
TOP 9 ET News: ప్రభాస్ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ | ‘ధురంధర్’కి రూ. 90 కోట్ల నష్టం
Tarun: తరుణ్ ఆ కారణంతోనే సినిమాలు చేయడం లేదు
అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్ సాంగ్ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా
