యూఎస్‌లో గందరగోళం.. ప్రయాణాలు కేన్సిల్ చేసుకుంటున్న భారతీయులు వీడియో

Updated on: Sep 22, 2025 | 1:49 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో అమెరికాలోని భారతీయులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విమాన టికెట్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక ఆకస్మిక నిర్ణయం అమెరికాలోని ప్రవాస భారతీయులను తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది. H-1B వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో గందరగోళం నెలకొంది. ఈ కొత్త నిబంధన ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావడంతో అమెరికా విమానాశ్రయాల్లో శుక్రవారం నుంచే అలజడి మొదలైంది. అమెరికాను విడిచి స్వదేశాలకు వెళ్లి తిరిగి రావాలంటే భారీగా రుసుము చెల్లించాల్సి ఉంటుందనే భయంతో చాలా మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా వేలాది మంది భారతీయులు అమెరికా నుండి భారతదేశానికి వెళ్లేవారు. ఈ పెద్దమొత్తంలో రుసుము చెల్లించే అవకాశం లేక వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు, ఇతర దేశాల్లో ఉన్న H-1B వీసాదారులు కొత్త నిబంధన అమల్లోకి రాకముందే అమెరికా చేరుకోవడానికి తొందరపడుతున్నారు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, భారత్‌కు బయలుదేరి విమానం ఎక్కిన కొంతమంది ప్రయాణికులు ఈ విషయం తెలుసుకుని వెంటనే విమానం దిగిపోయారు. శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించే కొంతమంది భారతీయులు ట్రంప్ ప్రకటన గురించి తెలుసుకుని హుటాహుటిన కిందకు దిగిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం :

కట్టలు కట్టలుగా పాములు..వామ్మో చూస్తేనే వణుకు పుడుతోంది డియో

దసరాకు శూర్పణఖ దహనం..ప్రియుడి కోసం పిల్లలు, భర్తలను చంపిన భార్యల ఫొటోలతో .. – TV9

మళ్లీ అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు వీడియోTV9

Published on: Sep 22, 2025 01:45 PM