అమెరికాలో దారుణం.. భారత మహిళను వెంటాడి కాల్చిన దుండగుడు వీడియో
అమెరికాలోని యూనియన్ కౌంటీలో భారతీయ సంతతికి చెందిన కిరణ్ పటేల్ అనే మహిళ దుండగుడి కాల్పులకు బలి అయింది. ఆమె స్వంత దుకాణంలో దోపిడీకి ప్రయత్నించిన దుండగుడిని ఎదుర్కొన్న సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగుడు పరారైయ్యాడు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలోని యూనియన్ కౌంటీ, పిక్నీ స్ట్రీట్‌లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ అనే భారతీయ మహిళ తన సొంత దుకాణం, డీడీస్ ఫుడ్ మార్ట్‌లో దోపిడీకి పాల్పడిన వ్యక్తిని ఎదుర్కొంది. దుండగుడు ఆమెపై కాల్పులు జరిపడంతో, ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. దుండగుడు ముసుగు ధరించి ఉన్నాడు. ఈ ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానిక ప్రవాస భారతీయులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కట్టలు కట్టలుగా పాములు..వామ్మో చూస్తేనే వణుకు పుడుతోంది డియో
దసరాకు శూర్పణఖ దహనం..ప్రియుడి కోసం పిల్లలు, భర్తలను చంపిన భార్యల ఫొటోలతో .. – TV9
మళ్లీ అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు వీడియోTV9
Published on: Sep 22, 2025 01:41 PM
