Diwali 2024: మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..

|

Oct 12, 2024 | 8:23 PM

ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంట్లో ఉంటుంది. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. పొగ వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందరికీ గ్యాస్ సిలిండర్ ఉండేలా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ను తీసుకువచ్చింది. దీంతో మహిళల పేరుపై చాలా మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించింది మోడీ సర్కార్. ఇక దీపావళికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు పెద్ద బహుమతిని ఇవ్వబోతోంది.

ఈ దీపావళి రోజున ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులందరికీ ఉచితంగా ఎల్పిజి సిలిండర్లు అందజేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు దీపావళికి ముందే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి. దీంతో లబ్దిదారులు ఈ ఉచిత సిలిండర్ ప్రయోజనం పొందనున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు గ్యాస్ కనెక్షన్తో పాటు ఉచితంగా సిలిండర్ను అందజేస్తున్నారు. సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా లభిస్తుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేయాలనుకుంటోంది. ఇదే అమలైతే.. ఏపీ మహిళలకు గ్యాస్ భారం కాస్త తగ్గుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on