Watch: హైదరాబాద్‌లో వేడుకగా సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్.. పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
హైదరాబాద్ హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఆఫీస్‌లో CISF రైజింగ్ పరేడ్ జరుగుతోంది. 53ఏళ్ల CISF సేవలను గుర్తించి గౌరవిస్తోంది దేశం..
హైదరాబాద్ హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఆఫీస్‌లో CISF రైజింగ్ పరేడ్ జరుగుతోంది. 53ఏళ్ల CISF సేవలను గుర్తించి గౌరవిస్తోంది దేశం.. దీనికి ముఖ్య అతిధిగా కేంద్రహోంమంత్రి అమిత్ షా విచ్చేశారు.. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హజరైయ్యారు.
1969 మార్చి10న మూడు వేల మంది సిబ్బందితో మొదలైంది ఈ CISF..కేంద్ర ప్రభుత్వ కార్యాలయలకు, ఎయిర్‌పోర్ట్, సీ పోర్ట్ లు, పవర్ ప్లాంట్స్, నేషనల్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కు భద్రత కల్పిస్తోంది CISF..టెర్రరిస్ట్ అటాక్స్, ఫ్లైట్ హైజాకింగ్స్, బాంబ్ బెదిరింపులు, పేలుడు పదార్థాల గుర్తింపు, వాటి తొలగింపుల్లో సిఐఎస్ఎఫ్ భద్రత సేవలు ముందు ఉంటాయి..దేశ వ్యాప్తంగా 1 లక్షా 80 వేల మంది సిబ్బందితో పటిష్ట భద్రతా సేవలు అందిస్తోంది..
Published on: Mar 12, 2023 08:14 AM
