Telangana: అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే.. క్షణాల్లో సీన్ సితారయ్యింది
ఇద్దరు దొంగలు అర్ధరాత్రి ఓ బైక్ దొంగలించడానికి వచ్చారు. ఏమైందో ఏమో.. క్షణాల్లో సీన్ సితారయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తం సీసీ కెమెరాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సీసీ కెమెరాను చూడక ముందు దొంగలు రెచ్చిపోతున్నారు. కానీ సీసీ కెమెరా చూడగానే వాళ్లలో భయంతో పాటు.. కాస్త తేడా కనిపిస్తోంది. ఇలాంటి తరహ ఘటన ఒకటి సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దర్జాగా దొంగతనానికి వచ్చారు. సొంత వాహనాన్ని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్తూ చివరి నిమిషంలో సీసీ కెమెరాలను చూసి ఒకరితో ఒకరు గొడవ పడి, అలిగి వాహనాన్ని ఎత్తుకెళ్లారు.
ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లె మండలం బుదేరా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ అనే వ్యక్తి తన బైక్‌ను రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వచ్చిన ఇద్దరు దొంగలు ఆ పల్సర్ వాహనాన్ని దొంగలించడానికి దాదాపు 15 నిమిషాలు ప్రయత్నించి చివరికి వాహనాన్ని దొంగలించారు. ఆ బైక్‌ను తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను చూసి ఒకరిని ఒకరు చూసుకుని జడుసుకున్నారు. నువ్వంటే నువ్వని కాసేపు గొడవపడి బైక్‌ను దొంగతనం చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..