Turakapalem Mystery: తురకపాలెంలో ఏం జరుగుతోంది.. మొదట చికిత్స చేసింది ఆర్ఎంపీనే..
రెండు నెలలుగా నరకం అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు గుంటూరుకు కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తులు.. పొలాలకు వెళ్లాలంటే భయం...! ఆరుబయట కూర్చోవాలన్నా భయం...! ఆఖరికి తినాలన్నా, తాగాలన్నా భయంతో బెంబేలెత్తిపోతున్నారు. 60 రోజుల్లో 30 మంది అకారణ మరణాలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ మిస్టరీ మరణాలపై అధికారులు, వైద్య నిపుణులు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
రెండు నెలలుగా నరకం అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు గుంటూరుకు కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తులు.. పొలాలకు వెళ్లాలంటే భయం…! ఆరుబయట కూర్చోవాలన్నా భయం…! ఆఖరికి తినాలన్నా, తాగాలన్నా భయంతో బెంబేలెత్తిపోతున్నారు. 60 రోజుల్లో 30 మంది అకారణ మరణాలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ మిస్టరీ మరణాలపై అధికారులు, వైద్య నిపుణులు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తురకపాలెంలో RMP క్లినిక్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ గ్రామంలో చనిపోయినవారిలో ఎక్కువమందికి.. RMP చికిత్స చేసినట్లు వైద్యాధికారులు ఆధారాలు సేకరించారు. RMPని అధికారులు విచారించారు.. అనంతరం క్లినిక్‌ని DMHO విజయలక్ష్మి సీజ్ చేశారు. అధికమోతాదులో యాంటీ బయాటిక్స్, సెలైన్లు వాడటం కూడా.. ఇన్ఫెక్షన్ పెరగడానికి కారణంగా వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది.
Follow Us
