మిస్టరీ మరణాలకు కారణాలేంటి..? తురకపాలెంలో బొడ్రాయికి శాంతిపూజలు..
తురకపాలెంలో అంతుచిక్కని మరణాలకు కారణం ఎవరినీ అడిగినా అందరి చూపు బొడ్రాయి వైపే.. దీన్ని నివారించాలంటే శాంతిపూజలు తప్పవని ఇవాళ పూజలు చేస్తున్నారు గ్రామస్తులు.. రెండు నెలల్లో తురకపాలెం గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోవడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితికి కారణం బొడ్రాయి అంటున్నారు..
తురకపాలెంలో అంతుచిక్కని మరణాలకు కారణం ఎవరినీ అడిగినా అందరి చూపు బొడ్రాయి వైపే.. దీన్ని నివారించాలంటే శాంతిపూజలు తప్పవని ఇవాళ పూజలు చేస్తున్నారు గ్రామస్తులు.. రెండు నెలల్లో తురకపాలెం గ్రామంలో ఏకంగా 30 మంది అకారణంగా చనిపోవడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితికి కారణం బొడ్రాయి అంటున్నారు..దీంతో గ్రామంలో భయాందోళనలు తొలగించేందుకు ఒకే తాటిపైకి వచ్చారు గ్రామస్తులు. కులమతాలకు అతీతంగా పూజలకు చేస్తున్నారు. బొడ్రాయిపై తలో బిందె నీళ్లు పోస్తున్నారు. ఇలా చేస్తే శాంతి కలుగుతుందని నమ్ముతున్నారు..
ఇదిలాఉంటే.. మరణాలకు కారణాలేంటో తేల్చడానికి శాస్త్రవేత్తల అధ్యయనం మొదలైంది. బ్యాక్టీరియానే కారణమని చెబుతూ వస్తున్న సైంటిస్టులు… అసలా బ్యాక్టీరియా ఏంటో తేల్చే పనిలో పడ్డారు. ఇక ఇవాళ మృతుల కుటుంబాలతో మాట్లాడనున్నారు NCDC టీమ్. సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కి పంపించనున్నారు. పరీక్షల ఫలితాల అనంతరం ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందిస్తామంటున్నారు సెంట్రల్ టీమ్ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్..
తురకపాలెంలో నమోదైన మెలియోయిడోసిస్ జ్వరాలు కలకలం రేపాయి.ఐతే గ్రామస్తులకు భరోసా కల్పిస్తూ ప్రత్తిపాడు MLA బూర్ల రామాంజనేయులు గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేశారు. అలాగే గ్రామస్తుల్లో ధైర్యం నింపేందుకు పల్లె నిద్ర కార్యక్రమం కింద తురకపాలెంలోనే రాత్రి నిద్రించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

