Andhra: డైవరన్న జర ఆగాల్సింది.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. కొంచెం అయితే..
మంత్రాలయం సమీపంలో వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది.. రోడ్డుపై నీళ్లు తక్కువే ఉన్నాయని డ్రైవర్ బస్సును పోనిచ్చాడు.. ఈ క్రమంలో బురద కారణంగా ఆర్టీసీ బస్సు మధ్యలో ఇరుక్కుపోయింది. దరువంపు వాగు ఉధృతి కారణంగా నాగలదిన్నె, కర్నూలు, ఐజ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలులో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. ఈ క్రమంలో.. మంత్రాలయంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీవర్షాలకు దరువంపు వాగు ఉప్పొంగింది.. దీంతో మంత్రాలయం సమీపంలో వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది.. రోడ్డుపై నీళ్లు తక్కువే ఉన్నాయని డ్రైవర్ బస్సును పోనిచ్చాడు.. ఈ క్రమంలో బురద కారణంగా ఆర్టీసీ బస్సు మధ్యలో ఇరుక్కుపోయింది. దరువంపు వాగు ఉధృతి కారణంగా నాగలదిన్నె, కర్నూలు, ఐజ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్ల వాగులో కూడా ప్రవాహం బాగా పెరిగింది. ఉదయాన్నే ఈ ఆర్టీసీ బస్సు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం వెళ్తుంది. ఈ క్రమంలో వరద కారణంగా బస్సు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్, మరో ప్రయాణీకుడు తృటిలో ప్రాణపాయం నుంచి బయట పడ్డారు. విద్యార్థులు బస్సులో లేరని.. తృటిలో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇలాంటి సమయంలో అప్రమత్తత అవసరం అని పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..
Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
భారీగా పడిపోయిన దుబాయ్‌లో బంగారం ధర..
మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి రాష్ట్రం
ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం
టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI
వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ చాట్‌జీపీటీ'..
జంబలకిడిపంబ హోలీ చూసారా.. !!

