శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకు శ్రీవారి దీవెనలతో అక్షింతలు పంపి శ్రీవారి ఆశీస్సులు ఆశీర్వదిస్తోంది టిటిడి. కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతీ అమ్మవారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని టీటీడీ అందిస్తోంది. ప్రతి ఏడాది శుభలేఖ పంపిన లక్షకు పైగా వధువరులకు శ్రీవారి దీవెనలతో ఇలా కల్యాణం జరుగుతోంది.
సమాజంలో గృహస్థ ధర్మం కీలకమైనది. వధువరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుండి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికి, వధువు ఎడమ చేతికి ధరింప చేస్తారు. ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ, కంకణధారణకు కంకణం పంపుతారు. వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, సిరిసంపదలు కలగాలని టిటిడి కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోంది. నూతన వధువరులకు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు కల్యాణ సంస్కృతి పేరిట ఒక పుస్తకాన్ని కూడా అందిస్తోంది. అలాగే శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీల ఫోటోలతో కూడిన వేద ఆశీర్వచన పత్రికను టిటిడి కార్యనిర్వహణాధికారి పేరిట పంపుతారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల తపాలా విభాగం సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం లక్షకు పైగా నూతన జంటలకు శ్రీవారి అశీస్సులు అందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
