అలిపిరిలో దొరికిన చిరుతలకు విముక్తి !! మరో చిరుతను విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ పార్క్ కు తరలింపు

|

Sep 20, 2023 | 9:55 AM

తిరుమల నడక మార్గంలో అలజడి సృష్టించిన చిరుతలను బంధించిన అటవీ శాఖ ఎట్టకేలకు వాటికి విముక్తి కల్పించింది. దాదాపు 3 నెలలుగా అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల్లో భయాన్ని కలిగించిన చిరుతలను బంధించే ప్రయత్నం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 24 నుంచి ఇప్పటిదాకా 5 చిరుతలను బంధించింది. ఇప్పటిదాకా 5 చిరుతలను బంధిస్తే ఇందులో ఒక చిరుతను జూన్ 24 న తిరుపతికి దగ్గరగానే చామల రేంజ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ వదిలిపెట్టింది.

తిరుమల నడక మార్గంలో అలజడి సృష్టించిన చిరుతలను బంధించిన అటవీ శాఖ ఎట్టకేలకు వాటికి విముక్తి కల్పించింది. దాదాపు 3 నెలలుగా అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల్లో భయాన్ని కలిగించిన చిరుతలను బంధించే ప్రయత్నం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 24 నుంచి ఇప్పటిదాకా 5 చిరుతలను బంధించింది. ఇప్పటిదాకా 5 చిరుతలను బంధిస్తే ఇందులో ఒక చిరుతను జూన్ 24 న తిరుపతికి దగ్గరగానే చామల రేంజ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ వదిలిపెట్టింది. ఆ తరువాత పట్టుబడ్డ నాలుగు చిరుతల్లో రెండింటికి ఎస్వి జూ పార్క్ నుంచి విముక్తి కల్పించింది. లక్షితపై దాడి చేసిన చిరుతలు ఇవి కావని నిర్ధారించుకున్న అటవీశాఖ అధికారులు వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 11న నడక మార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ టీం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇప్పటివరకూ పట్టుకున్న చిరుతల్లో రెండింటిని తిరుపతి ఎస్ వి జూ నుంచి తరలించారు. ఏపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో ఒక చిరుతను తిరుపతికి 350 కిలోమీటర్ల దూరంలో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో అటవీశాఖ సిబ్బంది వదిలి పెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గిరిజనులను గడగడలాడిస్తున్న గజరాజులు.. అటవీ అధికారి మృతి

Birth Certificate: అక్టోబర్ 1 నుంచి బర్త్‌ సర్టిఫికేట్ కొత్త రూల్స్ !!

Indian Railways: ఇకపై భారత్ రైళ్ళలో లోయర్ బెర్త్‌లు వారికే !!

Aditya-L1: పరిశోధనలు ప్రారంభించిన ఆదిత్య ఎల్‌1 సూర్యుడి దిశగా ప్రయాణం !!

బ్యాక్టీరియా సోకిన చేప తిని.. కాళ్లూచేతులు పోగొట్టుకున్న మహిళ !!

 

Follow us on