Watch Video: ఫ్రాంక్ వీడియోపై టీటీడీ సీరియస్.. తమిళనాడుకు స్పెషల్ టీం..
తిరుమల దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్‌లో ఫ్రాంక్ వీడియో చేయడంపై టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. తమిళనాడుకు చెందిన యువకులను అదుపులోకి తీసుకునేందు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక ప్రత్యేక విజిలెన్స్ టీంను తమిళనాడుకు పంపించింది. ఇప్పుడు తిరుమలకు వెళ్లు క్యూ కాంప్లెక్సుల్లో వీడియోలు తీసి పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మరింది. అక్కడి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి పలు ఫ్రాంక్ వీడియోలు చిత్రీకరించాడు.
తిరుమల దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్‌లో ఫ్రాంక్ వీడియో చేయడంపై టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. తమిళనాడుకు చెందిన యువకులను అదుపులోకి తీసుకునేందు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక ప్రత్యేక విజిలెన్స్ టీంను తమిళనాడుకు పంపించింది. ఇప్పుడు తిరుమలకు వెళ్లు క్యూ కాంప్లెక్సుల్లో వీడియోలు తీసి పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మరింది. అక్కడి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి పలు ఫ్రాంక్ వీడియోలు చిత్రీకరించాడు. దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి టీటీడీ అధికారిలా క్యూ కాంప్లెక్ తలుపులు తీసేలా ఫ్రాంక్ చేశారు.
వారు నిజంగా టీటీడీ అధికారులే అని భావించిన భక్తులు ఒక్కసారిగా గోవింద నామస్మరణతో లేచి నిల్చున్నారు. దర్శనం కోసం వెళ్లేందుకు సిద్దమయ్యారు. చివరకు వాళ్లు చేసింది ఫ్రాంక్ వీడియో అని తెలిసి మండిపడ్డారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ తిరుమల వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ఆకతాయిలు. ఇలా ఫ్రాంక్ చేసే యువకుడికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన టీటీడీ.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఫ్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్యగా అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలను ఖండించింది. ఆకతాయిలు చేసిన వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని తెలిపింది. వీరిని ఎలాగైనా పట్టుకుని తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

