TTD: టీటీడీ సంచలన నిర్ణయం..
టీటీడీ తిరుమల తరహాలో ఇతర ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణను విస్తరించనుంది. ఈ నెల 31 నుంచి మరో 19 ఆలయాల్లో అన్నప్రసాద పంపిణీ ప్రారంభమవుతుంది. 2026 నాటికి అన్ని ఆలయాల్లో భక్తులకు రుచికరమైన, శుచియైన అన్నప్రసాదాలు అందించడానికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, నాణ్యత పర్యవేక్షణ, కీలక పరిపాలనా సంస్కరణలు చేపట్టనుంది.
తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. మరింత రుచికరంగా, శుచిగా, నాణ్యతతో అన్నప్రసాదాలను అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇటీవల టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబుకు నివేదించిన టీటీడీ చైర్మన్, ఈవోలకు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం టీటీడీకి చెందిన 15 ఆలయాల్లో అన్నప్రసాదం అందిస్తుండగా, ఈ నెల 31 నుంచి మరో 19 ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని ఆదేశించారు. మిగిలిన 26 ఆలయాల్లో 2026 ఫిబ్రవరి 28 నుంచి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభం కానుంది. టీటీడీ అంచనా ప్రకారం ఇతర ఆలయాలకు సాధారణ రోజుల్లో రోజుకు 1500 నుంచి 2000 మంది భక్తులు, వారాంతాల్లో 10 వేల వరకు, పర్వదినాల్లో 25 వేల వరకు భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అన్నప్రసాదాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఈవో ఆదేశించారు. ఇప్పటి వరకు ఆలయాల్లో పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారీ నివేదికలు రూపొందించాలని సూచించారు. టీటీడీలో ఎవరైనా అన్య మతస్తులు పనిచేస్తున్నారా అనే అంశంపై పూర్తి నివేదిక తయారు చేసి చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలాగే దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని చారిత్రక ఆలయాలకు ఎంత మంది అర్చకులు, వేదపారాయణదారులు అవసరమో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిధిలోని ప్రతీ ఆలయానికి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) రూపొందించి వచ్చే సమావేశానికి అందించాలని సూచించారు. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు పోటు వర్కర్ల పదవీ పేర్లను ‘ముఖ్య పాచిక’, ‘పాచిక’ గా మార్చే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖతో సమన్వయం చేయాలని ఈవో స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొన్నటి దాకా రీతూ.. ఇప్పుడు భరణి! పవన్ గేమ్ ఖతం
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. బిడ్డను చూడడానికి వెళ్లిన తండ్రిని ఏం చేశారంటే..
Hardik Pandya: సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ ??
