Hydro Power Project: హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరుబాట
హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజనులు పోరుబాట పట్టారు. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని బూర్జ పంచాయతీ ప్రజలు ఆందోళన చేపట్టారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 51 రద్దు చేయాలన్నారు.
హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజనులు పోరుబాట పట్టారు. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని బూర్జ పంచాయతీ ప్రజలు ఆందోళన చేపట్టారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 51 రద్దు చేయాలన్నారు. ఆదానీ, నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌తో ఆరు పంచాయతీల్లో ఉన్న ప్రజలు భూములను నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. 7 వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారని గిరిజనులు మండిపడుతున్నారు. గిరిజన అటవీ హక్కుల చట్టాల్ని ఉల్లంఘించి షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలకు అనుమతిచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఆదానీ, నవయుగ హైడ్రా పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చూశారన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటును రద్దు చేయాలని కోరారు.
