రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. రెచ్చిపోతారంతే..!

|

Jul 20, 2024 | 8:54 PM

ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలు, ఔషధగుణాలు దాగి ఉన్నాయి.. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూరాలను ప్రతీరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా ప్రతీరోజూ రెండు ఖర్జురాలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. ఖర్జూరాల్లోని సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలు, ఔషధగుణాలు దాగి ఉన్నాయి.. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూరాలను ప్రతీరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా ప్రతీరోజూ రెండు ఖర్జురాలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. ఖర్జూరాల్లోని సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఐరన్, ఫోలేట్, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఉదయం లేవగానే ఖర్జూరాలను తీసుకుంటే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒకట్రెండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఖర్జూరంలో కరిగే, కరగని ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. మంచి ప్రేగు కదలికను ప్రోత్సహించడం ద్వారా ఖర్జూరాలు మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి. ఖర్జూరంలో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతాయి. కాబట్టి, ఉపవాస సమయంలో ఖర్జూరం తినమని చెబుతారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై ఈ స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నైఎక్స్‌ప్రెస్‌లు ఆగవు

కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట

Follow us on