పచ్చి బాదం పప్పు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వదలరు

Updated on: Jun 22, 2025 | 1:28 PM

బాదంప‌ప్పును రోజుకు 7, 8 తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తినాల‌ని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. కానీ, ప‌చ్చిబాదం కాయ‌లో కూడా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి బాదం పప్పు జెల్‌లాగా మెత్తగా ఉంటుంది.

రుచిలో తీపి, పులుపు, వగరు కలగలసి ఉంటుంది. ఇందులోని ఆరోగ్య ప్రయోజ‌నాలు మాత్రం అనేకం అంటున్నారు నిపుణులు. ఎండిన బాదం కంటే కూడా పచ్చి బాదంలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. దీనివల్ల మ‌ల‌బ‌ద్దకం త‌గ్గుతుంది. జీర్ణ వ్యవ‌స్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవ‌స్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బ‌రువు తగ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. ప‌చ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్ బి, ఫ్లేవ‌నాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలించి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. పచ్చి బాదం తినటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. బీపీ నియంత్రణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ప‌చ్చిబాదం ఎంతో మేలు చేస్తుంది. దీంతోపాటు గుండె పోటు రాకుండా ర‌క్షిస్తుంది. ప‌చ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఇ అధికంగా ఉండి చర్మం, జుట్టు సంరక్షణకు మేలు చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదలకుండా ఉన్న మొసలిని చూసి చనిపోయిందనుకున్నారు.. ఆ తర్వాత

చెట్ల పొదల్లో కళ్లు చెదిరే సీన్‌.. ఆశ్చర్యంతో చూస్తుండిపోయిన స్థానికులు