ఆప్రికాట్ పండు చాలా రుచికరమైన పండు. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ పండులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. వీటిని రోజు వారీ ఆహారంలో క్రమం తప్పకుండా తింటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఆప్రికాట్ పండును సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అయితే పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఆప్రికాట్ పండ్లలో బీటా కెరోటిన్, లుటిన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, జియాక్సంతిన్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఆప్రికాట్ పండ్లు కళ్లకు కూడా చాలా మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆప్రికాట్ పండ్లు కంటిశుక్లం, రేచీకటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఈ పండ్లలో వివిధ రకాల ఫైబర్ ఉంటుంది. ఈ పండు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపును సులువుగా క్లీన్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. బీటా-కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు వంటి పదార్థాలు శరీరంలోని యాంటీ-క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షిస్తాయి. ఆప్రికాట్ పండ్లు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. వీటిలో ఉండే అధిక రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. ఈ పండు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆప్రికాట్ పండ్లు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా కాపాడుతాయి. అంటే మీరు ఎంత కష్టపడి పనిచేసినా శరీరం బలహీనపడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని ప్రయోగించేటప్పుడు తప్పక మీ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంత్యక్రియలకు రూ.30 లక్షలు.. అనాథ శవాల్లా వదిలేస్తున్న ప్రజలు
మనిషి మెదడులో అమర్చిన ఇంప్లాంట్ పనిచేస్తోందోచ్
వరంగల్ లో చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్లిన యువతి
గర్ల్ ఫ్రెండ్ ను ఒళ్లో కూర్చోబెట్టుకొని బైక్ పై యువకుడి స్టంట్