అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మహారథంపై ఊరేగారు. రథోత్సవాన్ని తిలకిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నేడు అశ్వవాహన సేవ, రేపు చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి మహారథంపై విహరించారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవాన్ని తిలకిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని, జన్మాంతర పాపాల నుండి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సాయంత్రం శ్రీనివాసులు కల్కి అవతారంలో అశ్వవాహనంపై విహరించనున్నారు. దీంతో నేటితో బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ముగియనున్నాయి. రేపు ఉదయం పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం జరుగనుంది. అనంతరం సాయంత్రం జరిగే ధ్వజావరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 ముగియబోతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన పసికూన
హైదరాబాద్‌లో టీమిండియా క్రికెటర్ తిలక్‌వర్మ సందడి
Trump: మరోసారి సుంకాల బాంబు పేల్చిన ట్రంప్
H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు
నడిచి వెళ్లి చెట్లు ఎక్కే చేపను చూశారా ?? పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్న వింత
