Watch Video: వీడు మాములు దొంగ కాదు బాబోయ్‌.. బైక్‌ సైడ్‌ లాక్‌ వేసినా ఎలా బ్రేక్‌ చేశాడో చూడండి..

| Edited By: Narender Vaitla

Aug 17, 2023 | 6:35 PM

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు దొంగలు మితిమీరి రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలోనే కాదు.. లాక్‌ చేసి పార్క్‌ చేసిన వాహనాలను కూడా వదలడం లేదు. తాజాగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఇంటి ముందు బైక్ పార్క చేశాడు. అంతే ఆ బైక్ పై దొంగ కన్ను పడింది. చాలా చాకచక్యంగా బైక్ హ్యాండిల్ విరగొట్టి ఎత్తుకెళ్లాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంత మంది దొంగలు జల్సాల కోసం బైక్ల చోరీలకు పాల్పడుతున్నారని... వాటిని ఇతర జిల్లాలలో అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు...

పార్కింగ్ వాహనాలు చేసే వాహనాలే టార్గెట్‌. ఎక్కడైనా వాహనాలు పార్కింగ్ చేసి ప‌నుల‌కు లోప‌ల వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి వాహ‌నదారులు కంగుతింటున్నారు. వారి బైక్ దొంగ‌త‌నానికి గురి కావడంతో ల‌బోదిబో మంటూ పోలీస్టేష‌న్ మొట్లు ఎక్కుతున్నాడు. న‌గ‌రంలోనే కాకుండా జిల్లాల వారిగా సీసీ కెమెరాలు వున్నా ఏమాత్రం జంక‌కుండా య‌దేశ్చగా దొంగ‌త‌నం చేసేందుకు వెన‌కాడ‌టం లేదు బైక్ దొంగ‌లు. జిల్లాలో రోజు రోజుకు దొంగ‌త‌నాల‌కు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే హైదరాబాద్లో చోటు చేసుకుంది.

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు దొంగలు మితిమీరి రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలోనే కాదు.. లాక్‌ చేసి పార్క్‌ చేసిన వాహనాలను కూడా వదలడం లేదు. తాజాగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఇంటి ముందు బైక్ పార్క చేశాడు. అంతే ఆ బైక్ పై దొంగ కన్ను పడింది. చాలా చాకచక్యంగా బైక్ హ్యాండిల్ విరగొట్టి ఎత్తుకెళ్లాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంత మంది దొంగలు జల్సాల కోసం బైక్ల చోరీలకు పాల్పడుతున్నారని… వాటిని ఇతర జిల్లాలలో అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బుతో జల్సా చేస్తూ కాలం గడుపుతున్నారు. దొరికితే దొంగ, లేకుంటే దొరగా సమాజంలో తిరుగుతున్నారు.