Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. షాపింగ్‌ మాల్‌లో ఎగసిపడిన అగ్నికీలలు.!

|

Dec 18, 2023 | 9:49 AM

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు మాల్‌లోని మిగతా అంతస్థులకు చేరాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. జేసీబీ సహాయంతో మాల్‌ షట్టర్లను తొలగించారు.

అర్ధరాత్రి చెలరేగిన మంటలు ఉదయం 7 గంటల వరకు రెండు అంతస్తుల్లో అదుపులోకి వచ్చాయి. మిగతా రెండు అంతస్తుల్లోని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అగ్నిమాపక సిబ్బంది. అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో కోట్ల విలువైన సామగ్రి కాలిబూడిదైందని మాల్‌ నిర్వాకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.