Nandyala: టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. కూతురు ఇంటికి వెళ్లి వచ్చేసరికి…

Edited By:

Updated on: Mar 08, 2025 | 8:19 PM

నంద్యాల జిల్లాలో దొంగల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వారి తీరు చూస్తుంటే పక్కా స్కెచ్ వేసి దొంగతనం చేస్తున్నట్లు అనిపిస్తుంది. తాజాగా నంద్యాల జిల్లాలో దొంగలు స్థానిక టీడీపీ నేత ఇంట్లో దొంగతనం చేశారు. రూ. 20 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు తీసుకెళ్లారు...

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణ శివారు రైతునగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. శివసాయి గ్రీన్ హోమ్స్ కాలనీలో టీడీపీ నేత కోదండ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానిక నౌమాన్ నగర్‌లో ఉన్న తమ కూతురు ఇంటికి కోదండ రెడ్డి దంపతులు వెళ్లి తిరిగి వచ్చే లోపల ఇంట్లోని నగదు బంగారం అపహరిచి పరార్ అయ్యారు.

దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 20 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును అపహరించారు.చోరీ విషయం తెలిసిన కోదండ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. రూరల్ పోలీసుల బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Published on: Mar 08, 2025 08:19 PM